Tuesday, 30 March 2021

కోవిషీల్డ్ కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది....?

 🧪🧪🩺🩺కోవిషీల్డ్ , #కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది....?



//కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 4వ తేదీ వరకు దాదాపు 1.8 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. మార్చి 1నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది ఉత్తమమైనదన్న సందేహాలున్నపుడు ఈ  విషయాలు గుర్తించి నిర్ణయం తీసుకోవచ్చు. 


*కోవిషీల్డ్ :* 

కోవిషీల్డ్ ఒక వైరల్ వెక్టర్ టీకా. చింపాంజీలలో బలహీనపడిన సాధారణ జలుబు వైరస్‌ (అడెనోవైరస్) SARS-CoV-2 యొక్క స్పైక్ ప్రోటీన్ యొక్క జన్యు పదార్థాన్ని తీసుకుని ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేశారు.  


*కోవాక్సిన్ :* 

SARS-CoV-2 (స్ట్రెయిన్: NIV-2020-770) వైరస్‌నుంచి తయారైంది. దీన్ని శరీరంలోకి పంపడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను యాక్టివేట్‌ చేసి కరోనా వైరస్‌పై దాడి చేసేలా ప్రేరేపించేలా కోవాక్సిన్‌ పని చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. తద్వారా అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.


*కోవిషీల్డ్, కోవాక్సిన్లలో ఉండే రసాయన పదార్థాలు :*


*కోవిషీల్డ్ :*

* ఎల్-హిస్టిడిన్ ఇథనాల్

* ఎల్-హిస్టిడిన్ హైడ్రోక్లోరైడ్ మోనోహైడ్రేట్

* మెగ్నీషియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్

* పాలిసోర్బేట్ 80 *

* సుక్రోజ్

* సోడియం క్లోరైడ్

* డిసోడియం ఎడెటేట్ డైహైడ్రేట్ (EDTA)

* ఇంజెక్షన్ కోసం నీరు


*కోవాక్సిన్ :*

* అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్

* ఇమిడాజోక్వినోలినోన్ # (టిఎల్ఆర్ 7/8 అగోనిస్ట్)

* 2-ఫెనాక్సిథెనాల్

* ఫాస్ఫేట్ బఫర్ సెలైన్


*నిల్వ ఉంచే పరిస్థితులు :*

రెండు వ్యాక్సిన్లను 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయడంతోపాటు రవాణా చేయవచ్చు


*ఎన్ని డోసులు వేసుకోవాలి :*


*కోవిషీల్డ్ :*

12 వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఈ వ్యాక్సీన్‌ను ఇస్తారు. అయితే మన దేశానికి చెందిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) రెండు డోసుల మధ్య వ్యవధి 4 వారాలు సరిపోతుందని సూచించింది.


*కోవాక్సిన్ :*

కోవాక్సిన్ కూడా రెండు డోసుల మధ్య కాలవ్యవధి 4 వారాలు ఉంటే సరిపోతుంది.


*రెండు వ్యాక్సిన్లలో ఏది సమర్థవంతమైనది :*

ది ల్యాన్సెట్ సర్వే ప్రకారం కోవీషీల్డ్ వ్యాక్సిన్ 4 వారాల వ్యవధిలో 2 డోసులు పూర్తి చేసుకున్నట్టయితే దాదాపు 70శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని గుర్తించారు. 3 దేశాల్లో కోవీషీల్డ్ ట్రైల్స్ లో భాగంగా 11,636 మంది పేషెంట్లపై 3 ట్రైల్స్ సింగిల్ బ్లైండ్ గాను మరొకటి డబుల్ బ్లైండ్ ట్రైల్స్ చేశారు. రెండు డోసులు పూర్తయిన 12 వారాల గ్యాప్ తర్వాత దాని సమర్థత  82.4శాతం ఉన్నట్టు గుర్తించారు. 


*కోవాక్సిన్ :*

  

ఫేజ్-3 ట్రైల్స్ లో కోవ్యాక్సిన్ 81శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించారు. వ్యాక్సిన్ ట్రైల్స్ లో భాగంగా భారత్ లో 28,500 మందిపై డబుల్ బ్లైండ్ ట్రైల్స్ నిర్వహించారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ కంటే #కోవాక్సిన్ ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. 


*సమ్మతి :*

 

*కోవిషీల్డ్‌ :*

3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసినందున కోవిషీల్డ్‌కు సమ్మతి పత్రం అవసరం లేదు.


*కోవాక్సిన్ :*

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు అందుబాటులోకి రాక ముందే ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీ కోవాక్సిన్ కు అనుమతి ఇచ్చింది.  


*వ్యాక్సిన్ ధర :*

వ్యాక్సిన్లను ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా అందిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మాత్రం వ్యాక్సిన్ ధర 250 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ఏది వేసుకోవాలన్నది ప్రజలు నిర్ణయించుకునే అవకాశం లేదు. కానీ ప్రైవేట్ సంస్థల్లోనూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు మాత్రం నచ్చిన వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది. 


*సూచనలు :*

ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా తయారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే అందుబాటులో ఉన్న సమాచారం, దాని లక్షణాలు, గుణాలను పరిశీలించిన తర్వాత కోవాక్సిన్ కూడా  మంచిదని సిఫార్సు చేస్తున్నారు.


వైద్యుల పర్యవేక్షణలో పై రెంటిలో ఏది తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెసిస్టెన్స్ పవర్ ఇస్తాయి.

Monday, 29 March 2021

పొట్టి శ్రీరాములు-ఆంధ్ర రాష్ట్ర సాధన

 పొట్టి శ్రీరాములు-ఆంధ్ర రాష్ట్ర సాధన


మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని హేళన చేసింది.


 దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు  ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ లేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా  నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు.   ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులశ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.


           గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు.


మిత్రులకు విన్నప్పము, ,ఇ కష్టం మనకు తెలీదు కనీసం మన శ్రీరాములు ,ఘంటసాల గొప్పతనం

మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత

GK questions 30

🌍GK Questions - 30
...............................................

1️⃣ How many years called "GOLDEN JUBILEE " ?

A. 50 YEARS.

2️⃣ Which is the LARGEST STATE in India By AREA ?

A. RAJASTHAN.

3️⃣ Which CITY is Called SUGAR BOWL of INDIA ?

A. UTTARA PRADESH.

4️⃣ Which is the STATE FRUIT of HIMACHALA PRADESH ?

A. APPLE.

5️⃣ Which STATE is the LARGEST RICE PRODUCING State in India ?

A. WEST BENGAL.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


Friday, 26 March 2021

తీపి గురుతులు👴🏻మన వృద్ధులు

 తీపి గురుతులు👴🏻మన వృద్ధులు

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి 

     9848696955 



మూలన పడేస్తే 

 👴🏻వృద్ధులు, వ్యర్థులు.


ముంగిట్లో కూచోబెడితే 

  ఇంటిని కాచే పార్వతీ 🤴🏻👸🏻   

  పరమేశ్వరులు..


బతుకు బాటలో గతుకుల్ని 

  ముందుగా హెచ్చరించి, 

  కాపాడే సిద్ధులు వృద్ధులు..


వృద్ధులు సారధులైతే 

  యువకులు👨🏻 విజయులౌతారు..


అనుభవాల గనులు 

  ఆపాత 🪙బంగారాలు..


వదిలేస్తే వృద్ధులు 

  మంచానికి 🛌బద్ధులు..


చేయూతనిస్తే ప్రతి 

  వృద్ధులు ఓ 🧘🏻‍♂️బుద్ధులు..


నిర్లక్ష్యంగా చూస్తే కేవలం 

  మూడు 🧑🏻‍🦯కాళ్ల ముసలి..


తగిన గుర్తింపునిస్తే 

  విజయాన్నిచ్చే🤺 త్రివిక్రములు..


ఒకనాటి 👦🏻బాలురే 

  ఈనాటి 👴🏻వృద్ధులు..


మూలన పడ్డారని 

  చులకనగా చూడకు...

  పోయాక మూరెడు ⚰️కట్టెల 

  చితిలో కాల్చేస్తానని 

  ఎదురు చూడకు..


బతికినన్నాళ్లు నాలుగు🍱 మెతుకులు 

  పెట్టి ఇంత అరుసుకో..


వారు లేని నువ్వెక్కడ..

  నీ జీవితమెక్కడ..


ఎప్పుడు పోతారా అని 

  ఎదురు  చూసి..

  పోయాక దినాల రోజు వరకు 🫕తిని, 

  తాగి 🥃కడుపులు కడుక్కోవడమేనా..


నువ్వు కొన్నాళ్ళకు 👨🏻‍🦳వృద్దుడివే 

  అవుతావు.. 

  అప్పుడు నీ గతి 

  ఏంటో 🤔ఆలోచించు..


నువ్వు నీ తల్లి దండ్రులను, 

 ఎలా చూసుకున్నావో..

 నీ వారసులు గమనిస్తూనే  

 ఉన్నారు.. 

 నీకు అదే గతి పట్టేనేమో చూసుకో..


తనను పట్టించుకోకున్నా 

  నువ్వు పచ్చగా ఉండాలని 

  తపించే ఉదాత్తములు వృద్ధులు..                                                   

పలకరిస్తే చాలు పాలకడలిలా 

  పొంగులు వారే పసివారు 

  వృద్ధులు..


వృద్ధులంటే పై పైన చూస్తే జుట్టు 

  తెల్లబడిన ఫలిత కేశాలవారు..


అంతర్గతంగా 

  తలపండిన పండితులు..🙏


అందుకే మన పూర్వీకులు వృద్ధులకు అమిత గౌరవాన్నిచ్చేరు, ఇమ్మన్నారు..


మీరు ఇస్తారు కదూ... 

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

       9848696955

Thursday, 25 March 2021

PRC 2010 ALL GOs

 

PRC 2010 ALL GOs

PRC-2010 G.O.Ms.No. 52 & Other PRC Related G.O.s Released

Andhra Pradesh State Govt. released 


G.O.Ms.No. 52 on 25/02/2010 to implement Revised Pay Scales under Pay Revision Commssion (PRC) - 2010.
Andhra Pradesh Revised Scales of Pay Rules, 2010  shall be deemed to have come into force on the 1st July, 2008.These rules shall apply to all the Government employees whether temporary, regular or permanent appointed before 1st July, 2008.
The Revised Pay Scales will be implemented notionally from 01.07.2008 with monetary benefit from 01.02.2010. The arrears for the month of February, 2010 will be credited into the GPF accounts of the employees. The benefit of the Revised Pay Scales 2010 will be paid in cash for the salary of March, 2010 payable in April, 2010

The Revised Master scale in RPS-2010:
6700-200-7300-220-7960-240-8680-260-9460-280-10300-300-11200-330-12190-360-13270-390-
14440-420-15700-450-17050-490-18520-530-20110-570-21820-610-23650-650-25600-700-27700-
750-29950-800-32350-850-34900-900-37600-970-40510-1040-43630-1110-46960-1200-51760-1300-55660(80)


1.G.O. Ms.No. 52(Detailed), Dated: 25/02/2010 Download (517 Pages)
2. G.O. Ms.No. 52(Simplified), Dated: 25/02/2010 Download (13 Pages)
3. G.O.Ms.No. 63, Dated: 09/03/2010 - Dearness Allowance(DA) - Download
4. G.O.Ms.No. 64, Dated: 09/03/2010 - House Rent Allowance(HRA) - Download
5. G.O.Ms.No. 65, Dated: 09/03/2010 - City Compensatory Allowance(CCA) - Download
 6.  Cir.Memo.No.1040/48/A1/PC.I/2010,Dated:10-03-2010 - Allowing H.R.A. to the Employees working around 8 kms
        periphery of a Qualified City/Town-Instructions - Download
7. Memo. No. 33327-A/549/A1/PC-I/2009, Dated: 13.3.2010 - Procedural Instructions for fixation of pay of employees and      Audit of Claims – Instructions  -Circular - Download
8. G.O.Ms.No. 93, Dated: 03/04/2010 - Automatic Advancement Scheme(AAS) - Download
9. G.O.Ms.No. 99, Dated: 06/04/2010 - ALLOWANCES - AP Civil Services (Travelling Allowance) Rules -Download
10. G.O.Ms.No.100, Dated: 06/04/2010 - Enhancement of Minimum Pension –Sanction of Dearness Relief and Medical               Allowance     to Pensioners& Family pensioners and other benefits - Download
11. G.O.Ms.No.101, Dated: 06/04/2010 – Emoluments for calculation of retirement Gratuity & Enhancement of maximum             limit         of Retirement Gratuity from Rs.3,50,000/- to Rs.7,00,000/- - Download
12. G.O.Ms.No.102, Dated: 06/04/2010 - Death Relief - Relief in case of death of pensioners in receipt of service pension  –         Raised to a minimum of Rs.10, 000/- - Download
13. G.O.Ms.No.103, Dated: 06/04/2010 - ALLOWANCES - AP Manual of Special Pays and Allowances - Risk Allowance -                  Download
14. G.O.Ms.No.107, Dated: 07/04/2010 - CONVEYANCE CHARGES - AP Civil Services (Travelling
     Allowance) Rules - Download
15. G.O.Ms.No.108, Dated: 07/04/2010-ALLOWANCES -AP Manual of Special Pays and Allowances - Conveyance Allowance to         the     Blind and Physically Handicapped employees - Download
16 G.O.Ms.No.118, Dated: 07/04/2010 - ALLOWANCES - AP Manual of Special Pay & Allowances - HM Allowance - Download
17  G.O.Ms.No.119, Dated: 07/04/2010 - ALLOWANCES - A.P. Manual of Special Pays and Allowances – Revised rates of                 Clerical     Allowance, N.G.G.Os. Clinical Allowance, Rural Allowance, Night Duty Allowance and Theatre Allowance -             Download
18 G.O.Ms.No. 128, Dated: 17/04/2010 - ALLOWANCES - Andhra Pradesh Civil Services (Travelling Allowance) Rules -                  Transfer         Travelling Allowance - Download
19. G.O.Ms.No. 129, Dated: 17/04/2010 - ALLOWANCES - Andhra Pradesh Civil Services (Travelling Allowance) Rules -                 Travelling     Allowance on Tour - Download

డైలీ కరెంట్ అఫైర్స్ 25-03-2021

 

*డైలీ కరెంట్ అఫైర్స్*
*25-03-2021*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Q.1. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
జ. 23 మార్చి

Q.2. 67 వ జాతీయ అవార్డులో ఏ నటికి జాతీయ అవార్డు లభించింది?
జ. కంగనా రనౌత్

Q.3. ఏ పౌరాణిక నదిని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సలహా కమిటీని పునర్నిర్మించింది?
జ. సరస్వతి

Q.4. రాష్ట్ర ఉద్యోగులకు 30% వేతన పెంపు ఇచ్చిన రాష్ట్రం ఏది?
జ. తెలంగాణ

Q.5. మూడు పిఎసి ఉమెన్స్ బెటాలియన్ ఏర్పాటును ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు?
జ. ఉత్తర ప్రదేశ్

Q.6. రెండు రోజుల నందిని రివర్ ఫెస్టివల్ ఎక్కడ ముగిసింది?
జ. మంగుళూరు

Q.7. జంతువుల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి అంబులెన్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది?
జ. ఆంధ్రప్రదేశ్

Q.8. ఏ కంపెనీ ఎండి జెహ్ వాడియా తన పదవికి రాజీనామా చేశారు?
జ. గోయెర్

Q.9. 'అధికారిక స్వదేశీ భాష మరియు జ్ఞాన వ్యవస్థ పాఠశాల' ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
జ. అరుణాచల్ ప్రదేశ్

Q.10. గంగవరం ఓడరేవులో 58.1% వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఎవరు ప్రకటించారు?
జ. అదానీ పోర్ట్స్

Q.11. కోవిడ్ యొక్క సరైన ప్రవర్తనపై అవగాహన కల్పించడానికి ఏ రాష్ట్రం తీర్మాన ప్రచారాన్ని ప్రారంభించింది?
జ. మధ్యప్రదేశ్

Q.12. 2020 సంవత్సరానికి 'గాంధీ శాంతి బహుమతి' ఎవరికి ఇవ్వబడుతుంది?
జ. షేక్ ముజిబర్ రెహ్మాన్

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
పసుపులేటి నరేంద్రస్వామి
   9848696955

Wednesday, 24 March 2021

జీవితంలో పది నిమిషాలు

 *జీవితంలో పది నిమిషాలు*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

           9848696955 


పది నిమిషాలు గృహిణి ముందు కూర్చుంటే

జీవితం చాలా కష్టం అనిపిస్తుంది 


పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే

జీవితం చాలా సరళం అనిపిస్తుంది


పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే

ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది


పది నిమిషాలు నాయకుడి ముందు కూర్చుంటే 

మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది


పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే 

చస్తేనే మంచిది అనిపిస్తుంది


పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే 

మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది.


పది నిమిషాలు అధికారుల ముందు ముందు కూర్చుంటే 

ఈ ప్రపంచం మరీ స్లో అనిపిస్తుంది.


పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే 

మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది.


పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే 

మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.


పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే 

వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.


పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే 

వారి ముందు మన త్యాగం, సేవల ముందు ఏమీ లేదనిపిస్తుంది.


పది నిమిషాలు స్నేహితుని 

ముందు కూర్చుంటే 

జీవితం స్వర్గంలా ఉంటుంది.


 *అదీ స్నేహానికున్న విలువ* , *స్నేహంలోని* *గొప్పతనం....!!*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

     పసుపులేటి నరేంద్రస్వామి

           9848696955