Sunday, 11 April 2021

కరోనా హెచ్చరిక


కరోనా హెచ్చరిక

 ప్రమాదం *మరోసారి* కాపు కాసుకుని ఉంది.

*ఈ నాలుగు మాటలు చదవండి... ఆచరించండి... జాగ్రత్తగా ఉండండి...*

మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం.  మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.


ఒక సర్వే ప్రకారం...

మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం.  టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు *లక్షల్లో మనమధ్యే ఉన్నారు.*


*అందుచేత...*

● దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి.

● తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి.

● చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి.

● ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి.

● ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి.

● చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి.

● ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి.

● అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి.

● వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.

● వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి.  అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు.

● మీరు వారికి ఎంత ప్రాణస్నేహితులైనా కావచ్చు... లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు... వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి.

● ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి.

● అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి.

● ఇచ్చి పుచ్చుకోవడాలు మరికొంతకాలం ఆపేయండి.

● ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి.

● స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి. 

● ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

● అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి.

● గ్రూప్ వాకింగ్ కూడా మానేయండి.

● ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి.

● నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికీ క్షేమదాయకం.


ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి.

Saturday, 10 April 2021

అక్కడే

 ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లాడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు  


15 ఏళ్లకే మందు తాగడం నేర్చుకున్నాడు 


ఎలాగోలా స్కూల్ చదువు నుండి కాలేజీ కి వచ్చాడు 


అక్కడ పేకాట పడుచుపిల్లల్తో  ఆటలు నేర్చుకున్నాడు. 


దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.


20 ఏళ్ళకే డబ్బు కోసం దొంగతనం నేర్చుకున్నాడు.


అది సరిపోక హత్యలు చేయడము మొదలెట్టాడు.


దొంగ ఎన్ని రోజులో  దొరలాగా  తిరగలేడు కదా...


ఒకరోజు దొరికిపోయాడు.


మూడేళ్ళ విచారణ తరువాత అతనికి ఉరిశిక్ష పడింది.


మళ్ళీ ఎన్ని అప్పీళ్లు  పెట్టుకున్నా అవన్నీ కొట్టేసి  ఉరిశిక్షనే ఖరారు చేసి... ఆ    రోజును చెప్పేసారు


చివరగా అతని కోరిక ఏమని అడగగా?


 తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు... 


అతని కోరిక మేరకు వారిని పిలిపించారు... 


కన్నవాళ్ళు కదా కన్నపిల్లలు రాక్షసులనైనా ప్రేమిస్తారు  


పోలీసులు లాయర్లు సాక్షులు  అందరూ మోసం చేసి నీ ఉరికి  కారణమయ్యారని ఏడ్చారు తల్లి తండ్రులు...! 


అప్పుడు అతను వారు కాదు *నా మరణానికి  కారణం మీరే అని చెప్పాడు!!!* 


ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు కొట్టాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్  చేసి మరి అతన్ని నిందించారు.


అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం...!!! 


ఈరోజు ఉరితాడు నా మెడకు  రావడానికి కారణం మీరే అని కంటతడి పెట్టాడు...!!! 


ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తాయి....  


చిన్న తప్పులే కదా అని *వెనుకేసుకురాకండి* అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..

దయా గుణం

 *🍃🌷దయా గుణం  కలిగి ఉండాలి🌹* 

🕉️🌞🌎🏵️🌼🚩


*శరీరం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు,* 

 *మనిషి చేసే ఉపకారాలు* *దానాలే అతడి* 

 *కీర్తిని చిరస్థాయిగా* *ఉంచుతాయి,* 

 *దానగుణంలొ తనకెవరు* *సాటిలేరని*              *నిరూపించుకున్నాడు* *కర్ణుడు ..!* 

 *మహాదాతగా పేరు తెచ్చుకొని* 

 *చిరస్థాయిగా నిలిచాడు* 


 *ఒకరోజు అతడు ఓ బంగారు గిన్నెలో* 

 *సుగంధ భరితమైన లేపనాన్ని ఎడమ చేత* 

 *పట్టుకొని, కుడిచేతితో ఒంటికి పూసుకొంటున్నాడు,* 

 *అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీ కృష్ణుడు* 

 *బంగారు గిన్నె ఎంత చూడ ముచ్చటగా --* 

 *ఉందో అన్నాడు, కర్ణుడు నవ్వుతూ ఇదిగో* 

 *కృష్ణా .... తీసికో ... అని -- ఇవ్వబోయాడు,* 

 *అదేమిటి కర్ణా -- ఎడమచేతి తో ఇస్తు ఉన్నావు,* 

 *అనే సరికి  ..... ఈ గిన్నె కుడి చేతికి మారేసరికి* 

 *నా బుద్ధి మారిపోవచ్చు అని చెప్పినాడు కర్ణుడు,* 

 *ఎవరు ఏది కావాలంటే వెంటనే దానం* 

 *చేయడంలోనే అసలైన ఆనందం ఉందని* 

 *పురాణాలు చెబుతున్నాయి,* 

*మనిషి జీవితం లో మూడు విషయాలు* 

 *ముఖ్యమైనవని, శాస్త్రాలు చెబుతున్నాయి* 

 *ఒకటి దయ కలిగి ఉండటం,* 

 *రెండు దయ కలిగి ఉండటం,* 

 *మూడోది కూడా దయ కలిగి* *ఉండటమే,* 

 *మనసులో దయాగుణం ఉన్నవారే* 

 *దానధర్మాలు విరివిగా చేస్తూంటారు* 

   

🕉️🌞🌎🏵️🌼🚩

బతికున్నంత కాలం నా వాళ్లు

 ఒక మనిషి చనిపోయాడు.

దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది.

చుట్టూ చూశాడు.


చేతిలోపెట్టెతోదేవుడుతనదగ్గరకు

వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.


దేవుడు:

మానవా..నీ శరీరం పడిపోయింది.

ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి:

అయ్యో ఇంత త్వరగానా?

నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


దేవుడు:

తప్పదు నాయనా!

నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. 


మనిషి:

నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి.

ఏం తెచ్చారో చూస్తాను


దేవుడు:

నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి:

నావా? అంటే నా బట్టలు, డబ్బులు,

భూమి పత్రాలు అవా?


దేవుడు:

అవెప్పటికీ నీవి కావు.

అవన్నీ భూమివే.

ఇక్కడే ఉంటాయి


మనిషి:

పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


దేవుడు:

కాదు.

జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి.

కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి:

అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


దేవుడు:

అవి పరిస్థితులవి నీవి కావు


మనిషి:

నా స్నేహితులున్నారా అందులో?


దేవుడు:

వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి:

హూం..నా భార్య, బిడ్డలునా?


దేవుడు:

వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి:

అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


దేవుడు:

తప్పు.

నీ శరీరం థూళికి చెందినది.

మట్టిలో పడుతుంది.


మనిషి:

స్వామీ అయితే నా ఆత్మా?


దేవుడు:

ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి:

ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు.

కళ్లలోనీళ్లుసుడులుతిరిగాయిఆపెట్టె

ఖాళీగాఉంది.


మనిషి:

కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది.


🍁బతికున్నంత కాలం నా వాళ్లు,

🍁అవన్నీ నావే,

🍁ఇవన్నీ నాకే అని ఆశతో,

🍁ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి:

స్వామీ చివరగా అడుగుతున్నాను.

నాది అనేది ఏమైనా ఉందా అసలు?


దేవుడు:

ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.


🍁ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి,

చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

🍁అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పెంచాలి, 🍁భగవన్మామ స్మరణ చేయాలి.

🍁పశ్చాతాపులను క్షమించాలి.

🍁తోటివారి నుంచి మనకి

సంక్రమించే చెడును విసర్జించాలి, 

🍁మానవసేవ-మాధవసేవ అని గుర్తించి జీవించాలి.


🙏🙏సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

వెతికితే శూన్యం

 *పొలాలు* *స్థలాలు* అయ్యాయి,

*స్థలాలు* *గజాలు* అయ్యాయి,

*గజాలు* *నోట్లు* అయ్యాయి,

*ఆస్తులు* *కోట్లు* అయ్యాయి,

*డబ్బులు* *సీట్లు* అయ్యాయి,

*బాటిళ్లు* *ఓట్లు* అయ్యాయి,

*చానళ్లు* *గులాములు* అయ్యాయి

*పదవులు* *ఆస్తులు* అయ్యాయి,

*పల్లెలు* *బస్తీలు* అయ్యాయి,

*బ్రతుకులు* *సుస్తీలు* అయ్యాయి,

*జీవాలు* *శవాలు* అయ్యాయి,

*కలాలు* బలాలు అయ్యాయి,

*అలవాట్లు* *బలహీనతలు* అయ్యాయి,

*సిగ్గులు* *ఎగ్గులు* అయ్యాయి,

*లాభాల* *పెగ్గులు* అయ్యాయి,

*పీఠాలు* *మనుగడ* అయ్యాయి,

*విలువలు* *గతాలు* అయ్యాయి,

*వలువలు* *బరువు* అయ్యాయి,

*మాటలు* *బీటలు* అయ్యాయి,

*తలపులు* *తలవంపులు* అయ్యాయి,

*నిజాలు* *యిజాలు* అయ్యాయి,

*అతికినా వ్యర్థం*

*వెతికితే శూన్యం.

కృతజ్ఞత

 *కృతజ్ఞత*


నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి.అయితే నీకు ఉద్యోగము వచ్చింది....!

ఇతరులకు రాలేదు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


 నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో...

అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....!

జవాబు రాలేదు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం

చేస్తున్నావో....అదే దారిలో...

అనేకులు మరణించారు...!

*కృతజ్ఞత కలిగి ఉండు*


 ఏ స్థలంలో అయితే దేవుడు 

నిన్ను దీవించాడో,అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు,ఇంకా దీవెన రాలేదు..!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఆసుపత్రిలో  ఏ పడక  మీద ఉండి నీవు బాగుపడి 

ఇంటికెళ్ళావో......

అదే పడకపై ఉండి అనేకులు

మరణించారు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ వర్షమైతే నీ పొలానికి మంచి 

పంటలనిచ్చిందో...

అదే వర్షం,ఇతరుల  పొలాలను 

నాశనం చేసింది.

*కృతజ్ఞత కలిగి ఉండు*


 కృతజ్ఞత  కలిగి ఉండు ....

ఎందుకంటే 

నీవేదైతే కలిగి ఉన్నావో

 అది *నీ శక్తి* కాదు,

*నీ బలం* కాదు,

*నీ అర్హతలు* కాదు.

*కేవలం దేవుని అనుగ్రహం* అని 

గుర్తుంచుకో...

నీకు కలిగిన ప్రతీది ఇచ్చేవాడు

*ఆయనే*

ప్రతీ విషయంలో *దేవునికి* కృతజ్ఞత కలిగి ఉండండి.


🌻🌻🙏🙏🙏🙏🙏🌻🌻

కిడ్నీలో రాళ్లు

 #కిడ్నీలో_రాళ్లు_నవీన్_నడిమింటి_సలహాలు_పాటిస్తే_కరిగిపోతాయంతే...


              శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే. రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి. నేటి ఆధునిక జీవితాల్లో చాలామంది సరిపడా నీళ్లు త్రాగలేకపోతున్నారు. చాలా సందర్భాలలో ఈ రాళ్లు చిన్నవిగా ఉంటూ మూత్రం ద్వారా విసర్జించబడతాయి. అయితే కొందరిలో మరీ పెద్దవై మూత్రపిండాల్లో ఉండిపోతాయి. ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వీటిని నివారించాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 

 

1. కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు ఎక్కువుగా నీటిని త్రాగుతూ ఉండాలి. రోజుకి సుమారు 7 నుంచి 10 లీటర్ల నీటిని, ద్రవ పదార్ధాలను తీసుకుంటూ ఉండాలి.

2. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయానే త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.

 

3. అరటిచెట్టు బెరడును జ్యూస్‌లా చేసి తీసుకోవటం వల్ల కిడ్నీల్లో రాళ్లు మూత్రవిసర్జనతో పాటు బయటకు వస్తాయి.

 

4. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు చాక్లెట్లు, పాలకూర, సోయా, ఎండుచిక్కుడు, టమోటా వంటి ఆక్సలేట్ పదార్థాలు తినకూడదు.

 

5. క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. అందువల్ల అలాంటి ఆహార పదార్ధాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.

 

6. కొత్తిమీర ఆకుల్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు  మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.

 

7. గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి రోజూ త్రాగటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.వివరాలు కు లింక్స్ లో చూడాలి

https://www.facebook.com/1536735689924644/posts/2797261033872097/


#రాళ్లను_కరిగించే_ఔషధ_మొక్కలు


          ఆయుర్వేదంలో ఈ తరహా రాళ్లను మూత్రశ్మరి అని పిలుస్తారు. ఆశ్మ అంటే రాయి. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు నెమ్మదిగా  మూత్రనాళం లేదా మూత్రాశయంలోకి చేరి అక్కడ ఉండిపోతాయి. వీటిలో 85 శాతం మూత్రం ద్వారా బయటికి పోతాయి. అయితే రాళ్ల పరిణామం ఏడు మి.మీ కన్నా పెద్దగా ఉన్నప్పుడు మూత్రం ద్వారా బయటికి రావడం కష్టం అవుతుంది. అప్పుడే సమస్యలు ఎదురవుత


#తీసుకోవాల్సిన_జాగ్రత్తలు


         కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకి రెండు లీటర్ల మూత్రం బయటకు వచ్చేలా నీటిని తీసుకోవాలి. చెమట అధికంగా ఉన్నప్పుడు మరింత నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.


మద్యపానం, కాఫీ, టీ, శీతలపానీయాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీంలు, పాలకూర, మిరియాలు, బాదంపాలు, వేరుశనగలు, టమోట, నిమ్మజాతి పండ్లు, క్యాబేజీ, కాలీప్లవర్‌, మాంసాహారాన్ని పూర్తిగా మానేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కాల్షియం ఫాస్పేట్‌ వల్ల రాళ్లు ఏర్పడితే గోధుమపిండి, శనగపిండి, బఠాణీలను ఆహారంలో చేర్చకూడదు. 


శరీరాన్ని చురుగ్గా ఉంచాలి. వ్యాయమం, శరీరక శ్రమ, నడక అవసరం. అప్పుడే రాళ్లు మూత్రం ద్వారా బయటకు వస్తాయి. పవన ముక్తాసనం, భుజంగాసనం, ధనురాసనం, హలాసనం నిత్యం వేస్తే మంచిది. 


#మూలికలు_ఔషధాలు


         ఆరు నెలల పాటు రెండు పూటలా మూడు చెంచాల తులసి రసాన్ని తేనేలో కలిపి తీసుకుంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు బయటకు వచ్చే అవకాశముంది.


మొక్కజొన్న పొత్తులతో ఉండే పీచుని 40 గ్రాములు తీసుకుని అరలీటరు నీళ్లలో నానబెట్టి రెండు గంటల తరువాత తాగాలి. 


                 సంస్కృతంలో గోక్షుర, తెలుగులో పల్లేరు అని పిలిచే మూలిక ఈ సమస్యకు ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే పల్లేరు కాయల రసం లేదా కషాయం నిత్యం వాడితే మంచిది. 5 గ్రా ముల మొక్క లేదా కాయలకి ఎనిమిది రెట్లు నీటిని కలిపి నాలుగో వంతు మిగిలే వరకు కాచి గోరువెచ్చగా ఉండగానే తాగాలి.

ధన్యవాదములు