Sunday, 11 April 2021

కరోనా హెచ్చరిక


కరోనా హెచ్చరిక

 ప్రమాదం *మరోసారి* కాపు కాసుకుని ఉంది.

*ఈ నాలుగు మాటలు చదవండి... ఆచరించండి... జాగ్రత్తగా ఉండండి...*

మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం.  మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.


ఒక సర్వే ప్రకారం...

మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం.  టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు *లక్షల్లో మనమధ్యే ఉన్నారు.*


*అందుచేత...*

● దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి.

● తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి.

● చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి.

● ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి.

● ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి.

● చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి.

● ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి.

● అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి.

● వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.

● వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి.  అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు.

● మీరు వారికి ఎంత ప్రాణస్నేహితులైనా కావచ్చు... లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు... వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి.

● ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి.

● అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి.

● ఇచ్చి పుచ్చుకోవడాలు మరికొంతకాలం ఆపేయండి.

● ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి.

● స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి. 

● ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

● అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి.

● గ్రూప్ వాకింగ్ కూడా మానేయండి.

● ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి.

● నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికీ క్షేమదాయకం.


ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి.

Saturday, 10 April 2021

అక్కడే

 ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లాడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు  


15 ఏళ్లకే మందు తాగడం నేర్చుకున్నాడు 


ఎలాగోలా స్కూల్ చదువు నుండి కాలేజీ కి వచ్చాడు 


అక్కడ పేకాట పడుచుపిల్లల్తో  ఆటలు నేర్చుకున్నాడు. 


దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.


20 ఏళ్ళకే డబ్బు కోసం దొంగతనం నేర్చుకున్నాడు.


అది సరిపోక హత్యలు చేయడము మొదలెట్టాడు.


దొంగ ఎన్ని రోజులో  దొరలాగా  తిరగలేడు కదా...


ఒకరోజు దొరికిపోయాడు.


మూడేళ్ళ విచారణ తరువాత అతనికి ఉరిశిక్ష పడింది.


మళ్ళీ ఎన్ని అప్పీళ్లు  పెట్టుకున్నా అవన్నీ కొట్టేసి  ఉరిశిక్షనే ఖరారు చేసి... ఆ    రోజును చెప్పేసారు


చివరగా అతని కోరిక ఏమని అడగగా?


 తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు... 


అతని కోరిక మేరకు వారిని పిలిపించారు... 


కన్నవాళ్ళు కదా కన్నపిల్లలు రాక్షసులనైనా ప్రేమిస్తారు  


పోలీసులు లాయర్లు సాక్షులు  అందరూ మోసం చేసి నీ ఉరికి  కారణమయ్యారని ఏడ్చారు తల్లి తండ్రులు...! 


అప్పుడు అతను వారు కాదు *నా మరణానికి  కారణం మీరే అని చెప్పాడు!!!* 


ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు కొట్టాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్  చేసి మరి అతన్ని నిందించారు.


అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం...!!! 


ఈరోజు ఉరితాడు నా మెడకు  రావడానికి కారణం మీరే అని కంటతడి పెట్టాడు...!!! 


ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తాయి....  


చిన్న తప్పులే కదా అని *వెనుకేసుకురాకండి* అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..

దయా గుణం

 *🍃🌷దయా గుణం  కలిగి ఉండాలి🌹* 

🕉️🌞🌎🏵️🌼🚩


*శరీరం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు,* 

 *మనిషి చేసే ఉపకారాలు* *దానాలే అతడి* 

 *కీర్తిని చిరస్థాయిగా* *ఉంచుతాయి,* 

 *దానగుణంలొ తనకెవరు* *సాటిలేరని*              *నిరూపించుకున్నాడు* *కర్ణుడు ..!* 

 *మహాదాతగా పేరు తెచ్చుకొని* 

 *చిరస్థాయిగా నిలిచాడు* 


 *ఒకరోజు అతడు ఓ బంగారు గిన్నెలో* 

 *సుగంధ భరితమైన లేపనాన్ని ఎడమ చేత* 

 *పట్టుకొని, కుడిచేతితో ఒంటికి పూసుకొంటున్నాడు,* 

 *అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీ కృష్ణుడు* 

 *బంగారు గిన్నె ఎంత చూడ ముచ్చటగా --* 

 *ఉందో అన్నాడు, కర్ణుడు నవ్వుతూ ఇదిగో* 

 *కృష్ణా .... తీసికో ... అని -- ఇవ్వబోయాడు,* 

 *అదేమిటి కర్ణా -- ఎడమచేతి తో ఇస్తు ఉన్నావు,* 

 *అనే సరికి  ..... ఈ గిన్నె కుడి చేతికి మారేసరికి* 

 *నా బుద్ధి మారిపోవచ్చు అని చెప్పినాడు కర్ణుడు,* 

 *ఎవరు ఏది కావాలంటే వెంటనే దానం* 

 *చేయడంలోనే అసలైన ఆనందం ఉందని* 

 *పురాణాలు చెబుతున్నాయి,* 

*మనిషి జీవితం లో మూడు విషయాలు* 

 *ముఖ్యమైనవని, శాస్త్రాలు చెబుతున్నాయి* 

 *ఒకటి దయ కలిగి ఉండటం,* 

 *రెండు దయ కలిగి ఉండటం,* 

 *మూడోది కూడా దయ కలిగి* *ఉండటమే,* 

 *మనసులో దయాగుణం ఉన్నవారే* 

 *దానధర్మాలు విరివిగా చేస్తూంటారు* 

   

🕉️🌞🌎🏵️🌼🚩

బతికున్నంత కాలం నా వాళ్లు

 ఒక మనిషి చనిపోయాడు.

దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది.

చుట్టూ చూశాడు.


చేతిలోపెట్టెతోదేవుడుతనదగ్గరకు

వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.


దేవుడు:

మానవా..నీ శరీరం పడిపోయింది.

ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి:

అయ్యో ఇంత త్వరగానా?

నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


దేవుడు:

తప్పదు నాయనా!

నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. 


మనిషి:

నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి.

ఏం తెచ్చారో చూస్తాను


దేవుడు:

నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి:

నావా? అంటే నా బట్టలు, డబ్బులు,

భూమి పత్రాలు అవా?


దేవుడు:

అవెప్పటికీ నీవి కావు.

అవన్నీ భూమివే.

ఇక్కడే ఉంటాయి


మనిషి:

పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


దేవుడు:

కాదు.

జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి.

కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి:

అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


దేవుడు:

అవి పరిస్థితులవి నీవి కావు


మనిషి:

నా స్నేహితులున్నారా అందులో?


దేవుడు:

వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి:

హూం..నా భార్య, బిడ్డలునా?


దేవుడు:

వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి:

అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


దేవుడు:

తప్పు.

నీ శరీరం థూళికి చెందినది.

మట్టిలో పడుతుంది.


మనిషి:

స్వామీ అయితే నా ఆత్మా?


దేవుడు:

ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి:

ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు.

కళ్లలోనీళ్లుసుడులుతిరిగాయిఆపెట్టె

ఖాళీగాఉంది.


మనిషి:

కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది.


🍁బతికున్నంత కాలం నా వాళ్లు,

🍁అవన్నీ నావే,

🍁ఇవన్నీ నాకే అని ఆశతో,

🍁ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి:

స్వామీ చివరగా అడుగుతున్నాను.

నాది అనేది ఏమైనా ఉందా అసలు?


దేవుడు:

ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.


🍁ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి,

చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

🍁అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పెంచాలి, 🍁భగవన్మామ స్మరణ చేయాలి.

🍁పశ్చాతాపులను క్షమించాలి.

🍁తోటివారి నుంచి మనకి

సంక్రమించే చెడును విసర్జించాలి, 

🍁మానవసేవ-మాధవసేవ అని గుర్తించి జీవించాలి.


🙏🙏సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

వెతికితే శూన్యం

 *పొలాలు* *స్థలాలు* అయ్యాయి,

*స్థలాలు* *గజాలు* అయ్యాయి,

*గజాలు* *నోట్లు* అయ్యాయి,

*ఆస్తులు* *కోట్లు* అయ్యాయి,

*డబ్బులు* *సీట్లు* అయ్యాయి,

*బాటిళ్లు* *ఓట్లు* అయ్యాయి,

*చానళ్లు* *గులాములు* అయ్యాయి

*పదవులు* *ఆస్తులు* అయ్యాయి,

*పల్లెలు* *బస్తీలు* అయ్యాయి,

*బ్రతుకులు* *సుస్తీలు* అయ్యాయి,

*జీవాలు* *శవాలు* అయ్యాయి,

*కలాలు* బలాలు అయ్యాయి,

*అలవాట్లు* *బలహీనతలు* అయ్యాయి,

*సిగ్గులు* *ఎగ్గులు* అయ్యాయి,

*లాభాల* *పెగ్గులు* అయ్యాయి,

*పీఠాలు* *మనుగడ* అయ్యాయి,

*విలువలు* *గతాలు* అయ్యాయి,

*వలువలు* *బరువు* అయ్యాయి,

*మాటలు* *బీటలు* అయ్యాయి,

*తలపులు* *తలవంపులు* అయ్యాయి,

*నిజాలు* *యిజాలు* అయ్యాయి,

*అతికినా వ్యర్థం*

*వెతికితే శూన్యం.

కృతజ్ఞత

 *కృతజ్ఞత*


నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి.అయితే నీకు ఉద్యోగము వచ్చింది....!

ఇతరులకు రాలేదు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


 నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో...

అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....!

జవాబు రాలేదు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం

చేస్తున్నావో....అదే దారిలో...

అనేకులు మరణించారు...!

*కృతజ్ఞత కలిగి ఉండు*


 ఏ స్థలంలో అయితే దేవుడు 

నిన్ను దీవించాడో,అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు,ఇంకా దీవెన రాలేదు..!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఆసుపత్రిలో  ఏ పడక  మీద ఉండి నీవు బాగుపడి 

ఇంటికెళ్ళావో......

అదే పడకపై ఉండి అనేకులు

మరణించారు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ వర్షమైతే నీ పొలానికి మంచి 

పంటలనిచ్చిందో...

అదే వర్షం,ఇతరుల  పొలాలను 

నాశనం చేసింది.

*కృతజ్ఞత కలిగి ఉండు*


 కృతజ్ఞత  కలిగి ఉండు ....

ఎందుకంటే 

నీవేదైతే కలిగి ఉన్నావో

 అది *నీ శక్తి* కాదు,

*నీ బలం* కాదు,

*నీ అర్హతలు* కాదు.

*కేవలం దేవుని అనుగ్రహం* అని 

గుర్తుంచుకో...

నీకు కలిగిన ప్రతీది ఇచ్చేవాడు

*ఆయనే*

ప్రతీ విషయంలో *దేవునికి* కృతజ్ఞత కలిగి ఉండండి.


🌻🌻🙏🙏🙏🙏🙏🌻🌻

కిడ్నీలో రాళ్లు

 #కిడ్నీలో_రాళ్లు_నవీన్_నడిమింటి_సలహాలు_పాటిస్తే_కరిగిపోతాయంతే...


              శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే. రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి. నేటి ఆధునిక జీవితాల్లో చాలామంది సరిపడా నీళ్లు త్రాగలేకపోతున్నారు. చాలా సందర్భాలలో ఈ రాళ్లు చిన్నవిగా ఉంటూ మూత్రం ద్వారా విసర్జించబడతాయి. అయితే కొందరిలో మరీ పెద్దవై మూత్రపిండాల్లో ఉండిపోతాయి. ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వీటిని నివారించాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 

 

1. కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు ఎక్కువుగా నీటిని త్రాగుతూ ఉండాలి. రోజుకి సుమారు 7 నుంచి 10 లీటర్ల నీటిని, ద్రవ పదార్ధాలను తీసుకుంటూ ఉండాలి.

2. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయానే త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.

 

3. అరటిచెట్టు బెరడును జ్యూస్‌లా చేసి తీసుకోవటం వల్ల కిడ్నీల్లో రాళ్లు మూత్రవిసర్జనతో పాటు బయటకు వస్తాయి.

 

4. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు చాక్లెట్లు, పాలకూర, సోయా, ఎండుచిక్కుడు, టమోటా వంటి ఆక్సలేట్ పదార్థాలు తినకూడదు.

 

5. క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. అందువల్ల అలాంటి ఆహార పదార్ధాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.

 

6. కొత్తిమీర ఆకుల్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు  మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.

 

7. గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి రోజూ త్రాగటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.వివరాలు కు లింక్స్ లో చూడాలి

https://www.facebook.com/1536735689924644/posts/2797261033872097/


#రాళ్లను_కరిగించే_ఔషధ_మొక్కలు


          ఆయుర్వేదంలో ఈ తరహా రాళ్లను మూత్రశ్మరి అని పిలుస్తారు. ఆశ్మ అంటే రాయి. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు నెమ్మదిగా  మూత్రనాళం లేదా మూత్రాశయంలోకి చేరి అక్కడ ఉండిపోతాయి. వీటిలో 85 శాతం మూత్రం ద్వారా బయటికి పోతాయి. అయితే రాళ్ల పరిణామం ఏడు మి.మీ కన్నా పెద్దగా ఉన్నప్పుడు మూత్రం ద్వారా బయటికి రావడం కష్టం అవుతుంది. అప్పుడే సమస్యలు ఎదురవుత


#తీసుకోవాల్సిన_జాగ్రత్తలు


         కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకి రెండు లీటర్ల మూత్రం బయటకు వచ్చేలా నీటిని తీసుకోవాలి. చెమట అధికంగా ఉన్నప్పుడు మరింత నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.


మద్యపానం, కాఫీ, టీ, శీతలపానీయాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీంలు, పాలకూర, మిరియాలు, బాదంపాలు, వేరుశనగలు, టమోట, నిమ్మజాతి పండ్లు, క్యాబేజీ, కాలీప్లవర్‌, మాంసాహారాన్ని పూర్తిగా మానేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కాల్షియం ఫాస్పేట్‌ వల్ల రాళ్లు ఏర్పడితే గోధుమపిండి, శనగపిండి, బఠాణీలను ఆహారంలో చేర్చకూడదు. 


శరీరాన్ని చురుగ్గా ఉంచాలి. వ్యాయమం, శరీరక శ్రమ, నడక అవసరం. అప్పుడే రాళ్లు మూత్రం ద్వారా బయటకు వస్తాయి. పవన ముక్తాసనం, భుజంగాసనం, ధనురాసనం, హలాసనం నిత్యం వేస్తే మంచిది. 


#మూలికలు_ఔషధాలు


         ఆరు నెలల పాటు రెండు పూటలా మూడు చెంచాల తులసి రసాన్ని తేనేలో కలిపి తీసుకుంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు బయటకు వచ్చే అవకాశముంది.


మొక్కజొన్న పొత్తులతో ఉండే పీచుని 40 గ్రాములు తీసుకుని అరలీటరు నీళ్లలో నానబెట్టి రెండు గంటల తరువాత తాగాలి. 


                 సంస్కృతంలో గోక్షుర, తెలుగులో పల్లేరు అని పిలిచే మూలిక ఈ సమస్యకు ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే పల్లేరు కాయల రసం లేదా కషాయం నిత్యం వాడితే మంచిది. 5 గ్రా ముల మొక్క లేదా కాయలకి ఎనిమిది రెట్లు నీటిని కలిపి నాలుగో వంతు మిగిలే వరకు కాచి గోరువెచ్చగా ఉండగానే తాగాలి.

ధన్యవాదములు

కొబ్బరి నీళ్లు

 *🌴🫒  'అలసట తీర్చే కొబ్బరి నీళ్లు"...  🫒🌴*



*🫒  కొబ్బరి నీరు అలసట, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లల్లో లవణాలు, పోషక పదార్థాలు, రోగ నిరోధక శక్తి ఆధికంగా ఉంటుంది. రక్తం శుద్ధి అవుతుంది. కంటిచూపు మెరుగు పడటమే కాకుండా జ్వరం, జలుబు ఉన్నవారికి టానిక్‌లా పని చేస్తుంది.*


*🫒  వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో మంట తగ్గిస్తుంది. శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది.*


*🫒  ఈ నీటిలో పొటిషియం, సోడియం, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, కాఫర్‌, సల్ఫర్‌, క్లోరైడ్‌లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీటిలో ప్రొటీన్ల శాతం ఆవుపాలలో కంటే ఎక్కువగా ఉంటాయి.*


*🫒  కొబ్బరి నీళ్లు రోజూ తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్‌ఎటాక్‌ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు.*


 *🫒  తక్కువగా నీరు తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తరచూ తాగడం వల్ల చిన్నసైజ్‌ రాళ్లు త్వరగా కరిగిపోతాయి. అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.*


  *🫒  కొబ్బరి నీళ్లను రెగ్యులర్‌గా తాగడం వల్ల డీ హైడ్రేషన్‌ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే కొబ్బరి నీళ్లు మంచిగా పని చేస్తాయి. అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.*


*🫒  కొబ్బరి నీరు జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటే ఇలాంటి తిమ్మిర్లు వస్తాయి. అయితే కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచుతుంది. దీంతో కండరాల తిమ్మిరి సమస్య ఉండదు.*


  *🫒  బాగా అలసిపోయినపుడు కొబ్బరి నీళ్లు తాగితే చాలు. మీరు వెంటనే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు.*


  *🫒  ఈ నీటిని తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నీరు బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. జుట్టు నిగనిగలాడుతుంది. వీటన్నింటి కోసం మీరూ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే చాలు.*

Telugu years with names

 *_మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి._*


_*Know the Telugu Year you born*_

 

*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల

*(1870,1930,1990)*: ప్రమోదూత

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస

*(1873,1933,1993)*శ్రీముఖ

*(1874,1934,1994)*: భావ

*(1875,1935,1995)*: యువ

*(1876,1936,1996)*: ధాత

*(1877,1937,1997)*:  ఈశ్వర

*(1878,1938,1998)*: బహుధాన్య

*(1879,1939,1999)*: ప్రమాది

*(1880,1940,2000)*: విక్రమ

*(1881,1941,2001)*: వృష

*(1882,1942,2002)*: చిత్రభాను

*(1883,1943,2003)*: స్వభాను

*(1884,1944,2004)*: తారణ

*(1885,1945,2005)*: పార్థివ

*(1886,1946,2006)*:  వ్యయ

*(1887,1947,2007)*: సర్వజిత్

*(1888,1948,2008)*: సర్వదారి

*(1889,1949,2009)*: విరోది

*(1890,1950,2010)*: వికృతి

*(1891,1951,2011)*: ఖర

*(1892,1952,2012)*:  నందన

*(1893,1953,2013)*: విజయ

*(1894,1954,2014)*: జయ

*(1895,1955,2015)*: మన్మద

*(1896,1956,2016)*: దుర్ముఖి

*(1897,1957,2017)*: హేవిళంబి

*(1898,1958,2018)*: విళంబి

*(1899,1959,2019)*: వికారి

*(1900,1960,2020)*: శార్వరి

*(1901,1961,2021)*: ప్లవ

*(1902,1962,2022)*: శుభకృత్

*(1903,1963,2023)*: శోభకృత్

*(1904,1964,2024)*: క్రోది

*(1905,1965,2025)*: విశ్వావసు

*(1906,1966,2026)*: పరాభవ

*(1907,1967,2027)*: ప్లవంగ

*(1908,1968,2028)*: కీలక

*(1909,1969,2029)*: సౌమ్య

*(1910,1970,2030)*:  సాదారణ

*(1911,1971,2031)*: విరోదికృత్

*(1912,1972,2032)*: పరీదావి

*(1913,1973,2033)*: ప్రమాది

*(1914,1974,2034)*: ఆనంద

*(1915,1975,2035)*: రాక్షస

*(1916,1976,2036)*: నల

*(1917,1977,2037)*: పింగళ

*(1918,1978,2038)*: కాళయుక్తి

*(1919,1979,2039)*: సిద్దార్థి

*(1920,1980,2040)*: రౌద్రి

*(1921,1981,2041)*: దుర్మతి

*(1922,1982,2042)*: దుందుభి

*(1923,1983,2043)*: రుదిరోద్గారి

*(1924,1984,2044)*: రక్తాక్షి

*(1925,1985,2045)*: క్రోదన

*(1926,1986,2046)*: అక్షయ


దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి

సూర్యుడిని ఎప్పుడు చూడాలి

 🌺. సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు

ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.🌺 🙏


🌺.మూడు అమావాస్య ల లో 90 తెల్ల జిల్లేడు పువ్వులు,మారేడు ఆకులు లతో శివుడు కి పూజ చేస్తే దరిద్రం పోతుంది 🌺


🌺. మాతృ, పితృ, ఆచార్య, దైవ ఋషి రుణాలంటే

పశుపక్షాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బైటికి తరిమెయ్యరు. తల్లీ, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్లి కూడా చేసి ధర్మ, అర్థాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. తల్లీ, తండ్రీ రుణం, ఎంత సేవచేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వారని బిడ్డల్లా చూసుకోవటమే.

మల ముత్రాలకు కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్తముతో పెంచి పెద్ద చేసిన తండ్రి ఋణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నేర్పినందుకు గురు ఋణాన్ని, మనకి బుద్ధినీ, కర్మనీ ఇస్తున్న దైవ ఋణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలనూ, ధర్మాలనూ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి.తిరిగి తాను  వివాహం ద్వారా అన్ని రుణాలన్నీ తీర్చి, తరిగి తాను ఋణ పడటమే మానవ జన్మ.🌺

దక్షిణ లేదా సంభావన అంటే

 🙏🌺దక్షిణ..సంభావన..అంటే ఏమిటి 🌺🙏


🌺దక్షిణ కూడా ఒక విధమైన దానమే. దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక నిబద్ధత అనేది ఏమి ఉండదు. అనగా ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడుతుంది. అది ఒక బాధ్యత. 🌺


🌺ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన.

ఇది ఎవరికైనా ఇవ్వతగినదే కానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో, రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన.🌺 


🌺ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే. దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు.🌺


🌺ధార్మిక కార్యక్రమాలు చేయించుట ద్వారా బ్రాహ్మణులు యజమానికి తన పుణ్యము పక్వమునకువచ్చునట్లు చేయుటే గాక, అతడిచ్చు దక్షిణ స్వీకరించి అతడి పూర్వ పాపములో భాగము పంచుకొంటున్నాడు. ఆ పాపాన్ని పోగొట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను.🌺


🌺సాధారణముగా త్రికాల సంధ్యావందనము వలన ఆ పాపములు శమించుచుండును. కానీ ఒక్కొక్కసారి అంతకుమించిన ప్రాయశ్చిత్తములు కూడా చేసుకొనవలసి వచ్చును. బ్రాహ్మడికి దక్షిణ ఇంత అనీ ఎక్కడా నిర్వచనము లేదు. అయితే , ' విత్త శాఠ్యము ' లేకుండా , తనకు ఉన్న శక్తికొలదీ వీలైనంత ఎక్కువగా ఇచ్చి బ్రాహ్మణుడిని సంతృప్తి పరచవలెను. 🌺


🌺బ్రాహ్మణుడు చేయించిన పూజల/ హోమాల ఫలితము పూర్తిగా యజమానికి దొరకవలెనంటే అతడు తన శక్తికొలదీ దానము దక్షిణగా ఇవ్వవలెను. పీనాసితనము చేయరాదు. శక్తి ఉండీ తక్కువ దక్షిణను ఇచ్చినచో అతడి కార్యము అంతమేరకు కుంటుబడుతుంది. కావలసిన కార్యములు దానివలన పూర్తిగా సఫలము కావు. శక్తిలేనివాడు తక్కువ ఇచ్చినా కూడా అతడి కార్యము పూర్తిగా సఫలమవుతుంది. కాబట్టి, తన శ్రేయస్సు కోసము , బ్రాహ్మణుడి చేత కార్యములు చేయించుకొను యజమాని ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా దక్షిణ ఇచ్చుచుండవలెను.🌺


🌺దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి.🌺


🌺ఏదైనా కార్యము ముగిసిన వెంటనే దక్షిణ ఆ పురోహితులకు ఇచ్చినచో అది యజమానికి సర్వశుభములనూ కలుగజేయును. 🌺


🌺అలాకాకుండా , ఏ కారణము చేతనైనా వెంటనే ఇవ్వలేక పోతే , ఒక రాత్రి గడిచాక ఇస్తే , ఆ దక్షిణను రెట్టింపుగా ఇవ్వవలెను. 


ఒక మాసము గడిచినా ఇవ్వకుండా, తరువాత ఇస్తే దక్షిణను , తాను అనుకున్నదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇవ్వవలెను. 🌺


🌺రెండు మాసముల తరువాత ఇస్తే , వెయ్యిరెట్లు ఇవ్వవలెను. 


సంవత్సరము గడిచాక ఇస్తే , అది నిష్ప్రయోజనమే కాక, ఆ యజమానికి నరక ప్రాప్తి తప్పక కలుగును అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.🌺

గోమాత కసాయి

 ఒకరోజు పశు వధ శాలలో ఒకడు గోవును చంపడానికొచ్చినపుడు.....

గోవు వానిని చూసి నవ్వింది.


దాన్ని చూసి కసాయి అడిగాడు.

నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?

అని అడిగాడు.

.

అప్పుడు గోవు ఇలా చెప్పింది.

.

నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు.

.

అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది.

ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను, నువ్వు చంపి, నా మాంసాన్ని తినే 

నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను.

.

పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ పిల్లలకూ పాలిస్తున్నాను. కానీ నేను తినేది మాత్రం గడ్డి.


పాలతో వెన్న చేసుకున్నారు.వెన్నతో నెయ్యి చేసుకున్నారు.

నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు.

అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.


ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.


కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్.....

నా పాలనుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావ్.


ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే.

నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్.

కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావ్.


నిన్ను కన్న తల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను.

శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.


నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?


నా సంతతిని ,నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే 


మీకు ,మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో 


మాకే ... భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు ..మీ కెక్కడి మనుగడ,అందుకే  


నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను. అని చెప్పింది.


.***************************************************************************

(మీకు సాధ్యమైనంతవరకూ మీ బంధుమిత్రులందరికీ

ఇది తెలియజేసి గోమాత ఋణాన్ని తీర్చండి.)

జై గోమాత.🙏

So friends...... Share... చేయండి.....అందరికీ  గోమాత విశిష్టత తెలియజేయండి.

రాముడు రాముడే

 *🛕సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా...🛕*   


తండ్రిమాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం అమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు. ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి, దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతుంది. తండ్రి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్లిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ మూర్తే. రామాయణంలో రాముడి లక్షణాలు గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపారు. అయితే రాముడితోపాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు.

ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా... ఇలా ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. మానవ ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక. లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక అయితే హనుమంతుడు భక్తికి ప్రతీక.  


 రామునిలో ఉన్న 16 గుణాలు ఏవంటే...


1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11.ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15.ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.


ఈ సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా....

సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక... లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక.....హనుమంతుడు భక్తికి ప్రతీక. తన అంచంచలమైన భక్తితో హనుమంతుడు నేటికీ చిరంజీవిగా ఉన్నాడు. స్వామి భక్తి పరాయణుడైన వాయు నందనుడు నిరంతరం రామ నామ స్మరణతోనే గడిపాడు. ఇక లక్ష్మణుడు అన్నావదినల సేవ కోసం పద్నాలుగేళ్లు నిద్ర లేకుండా ఉండేలా వరం పొందాడు. తన నిద్రను భార్య ఊర్మిళకు అనుగ్రహించడంతో లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చే వరకు ఆమె మేల్కోలేదు. రావణుడు అపహరించడానికి ప్రయత్నిస్తే ఆత్మత్యాగానికి సిద్ధపడింది. అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించి, మాయ సీతను రావణుడు తీసుకుపోయోలా చేశాడు.

శ్రావణమాసం

 శ్రావణా మాసాన శుభ శుక్రవారాన 

సిరులు కురిపించుమా శ్రీలక్ష్మి దేవీ

పాలసంద్రములోన పుట్టినా తల్లీ

విష్ణువు హృదయాన వెలసినా రాణీ


చల్లని చంద్రికలు జాలువారిన భువిని

వెండి తళతళకాంతి వేల్పు తోబుట్టువు

మాబతుకులలోన పండు వెన్నెల కురిసి

సుఖ శాంతులివ్వుమాశరదిందుచంద్రికా


కామధేనువు, కల్ప వృక్షములతోడుత

కోరికలు తీర్చు మాకనక మహాలక్ష్మీ

ధాన్యసంపదలిచ్చు,విద్యా ధైర్యము నిచ్చు

ఆదిలక్ష్మి వైమమ్ము ఆదుకోవమ్మా


ఆరోగ్యమానంద మిచ్చు ధన్వంతరీ వేల్పు

తోబుట్టువు గాన రోగబాధలు బాపు

వరములిచ్చి వేగ వారిజాక్షిరో నీవు

మాజన్మ తరియింప మమ్ము బ్రోవు తల్లీ


అన్ని కళలు తోడు అష్టలక్ష్మీ వమ్మా

కొంగు బంగారమై కామితములీయగా

వ్రతము సలిపి మేమువేడెదము తల్లీ

వరలక్ష్మి దేవి  వరములిచ్చి దీవించవే


శ్రావణా మాసాన శుభ శుక్రవారాన


రచన:ఎన్.సి రోజా దేవి

సూర్యాపేట

Quotes

 *శుభోదయం*


           *నిజంగా  ప్రేమించేవారెవరైనా  ప్రపంచంలోకెల్లా  అందమైనవారిని  కోరుకోరు.*

         *తన  కోసం  ప్రపంచాన్ని   అందంగా  మార్చగలిగేవారిని మాత్రమే కోరుకొంటారు .*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞


*శుభోదయం*       

               

        *తప్పు జరిగినప్పుడు మనల్ని వదలి వెళ్ళిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు!*

          *కానీ మన తప్పుని మన్నించి సరిదిద్ది మనకు తోడుండేవారు చాలా తక్కువ మంది ఉంటారు!*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞


*శుభోదయం*

  

         *ఎంత సంపాదించినా కలగని ఆనందం.*

       *ఒక మంచి మిత్రుణ్ణి సంపాదించినపుడు కలుగుతుంది.*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

త్రివిధ త్యాగాలు

 🙏   త్రివిధ త్యాగాలు  🙏


🍂🍂🍂☘️☘️☘️🍂🍂🍂


ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి.


ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జనన మరణ సంసారచక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.


యత్కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి దదాసియత్

యత్తపస్యసి, కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్


" అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, అదంతా నాకు సమర్పించు.


అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి?

ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.


🍂 మొదటిది కర్తృత్వ త్యాగం:

                  ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కర్యాలకు పూనుకుంటాము.


🍂 రెండవది ఫలత్యాగం:

               ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.


🍂 మూడోది సంగత్యాగం:

              ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే

నాఆనందం అని మనస్పూర్తిగా అనుకోవాలి.


సరే! ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి?


ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెపితే చాలు.

ఏమిటండీ ఆ బంగారాల మాట? అదే 


🙏🏻 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🏻


పై త్రివిధ త్యాగలను త్రికరణ శుద్ధిగా అవలంబిస్తూ, ఇంకొక్క మాటను కూడా జోడించాలి.అది...


🙏🏻 సర్వేజనా సుఖినోభావంతు 🙏🏻


🍁🍁🍁🍁

తెలుగు సంవత్సరాలు

 *తెలుగు సంవత్సరాలు ఫలితాలు*


*తెలుగు సంవత్సరాలు మొత్తం 60*.


తెలుగు సంవత్సరం పేరు సంవత్సర ఫలితము.

1 *ప్రభవ* యజ్ఞములు విరివిగా జరుగుతాయి.

2 *విభవ* జనులు సుఖముగా ఉంటారు.

3 *శుక్ల* పంటలు సమృద్ధిగా పండుతాయి.

4 *ప్రమోదూత* ప్రజలందరు ఆనందంగా ఉంటారు

5 *ప్రజోత్పత్తి* అంతటా అభివృద్ధి కనిపిచును

6 *అంగీరస* భోగములు కలిగి ఉంటారు

7 *శ్రీముఖ* లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది

8 *భావ*  ఉన్నత భావమును కలిగిస్తుంది

9 *యువ* ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది

10 *ధాత*  అన్ని ఔషధులు(మొక్క ధాన్యాలు)పండును

11 *ఈశ్వర* అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును

12 *బహుధాన్య* దేశమంతా సుభిక్షముగా ఉంటుంది

13 *ప్రమాది*

14 *విక్రమ* మధ్యమ వర్షపాతము ఉంటుంది

15 *వృష* అంతటా వర్షములు కురుస్తాయి

16 *చిత్రభాను* చిత్రవిచిత్ర అలంకారములను ఇస్తుంది

17 *స్వభాను*  క్షేమము ఆరోగ్యము ఇస్తుంది

18 *తారణ*    పంటలకు అనుకూలముగా వర్షములు కురుస్తాయి

19 *పార్థివ* సస్యములు సంపదలు సమృద్ధి ఔతాయి

20 *వ్యయ*  అతివృష్ఠి కలుగుతుంది

21 *సర్వజిత్తు*  ప్రజలు సుఖించునట్లు వర్షాలు పడతాయి.

22 *సర్వధారి* సుభిక్షముగా ఉంటుంది.

23 *విరోధి*    మేఘాలను హరించి వర్షము పడకుండా చేద్తుంది

24 *వికృతి* భయంకరముగా ఉంటుంది

25 *ఖర*  పురుషులు వీరులౌతారు

26 *నందన*  ప్రజలు ఆనందముగా ఉంటారు

27 *విజయ*  శత్రువులను హరించును

28 *జయ*  శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది

29 *మన్మథ* జ్వరాఫ్హిబాఫ్హలు కలుగును

30 *దుర్ముఖి*  ప్రజలు దుష్కర్మలు చేస్తారు

31 *హేవిలంబి*  (లేదా) *హేమలంబ*  సంపదలు కలుగును

32 *విలంబి* సుభిక్షముగా ఉంటుంది

33   *వికారి*  శత్రువులకు కోపము కలిగించును

34 *శార్వరి*  అక్కడక్కడా పంటలు పండును

35   *ప్లవ*  *సమృద్ధిగా జలం ప్రవహించును*

36 *శుభకృతు*  ప్రజలు శుభముంగా ఉంటారు

37 *శోభకృతు* ప్రజలు శుఖంగా ఉంటారు

38 *క్రోధి*  కోపస్వభావం పెరుగుతుంది

39   *విశ్వావసు* ధనసమృద్ధి కలుగుతుంది

40   *పరాభవ*  ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకుంటారు

41   *ప్లవంగ*  జలసమృద్ధి అధికంగా ఉంటుంది

42   *కీలక*  సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది

43   *సౌమ్య*  ప్రజలకు శుభములు కలుగుతాయి

44   *సాధారణ*  ప్రజలకు సామన్య శుభములు కలుగుతాయి

45   *విరోధికృతు*  ప్రజలలో విరోధభావం పెరుగుతుంది

46   *పరీధావి*  ప్రజలలో భీతి అధికం ఔతుంది

47   *ప్రమాదీచ*

48   *ఆనంద*  ప్రజలు ఆనదంగా ఉంటారు

49   *రాక్షస*  ప్రజలులో క్రూర స్వభావం అధికమైరుంది

50   *నల*  

51   *పింగళ (లేదా) పింగల*

52   *కాళయుక్తి (లేదా) కాలయుక్తి*

53   *సిధ్ధార్థి*

54   *రౌద్రి*  ప్రకృయి విపత్తులు సంభవిస్తాయి

55   *దుర్మతి*  ప్రజలకు దుర్బుద్ధులు అధికమౌతాయి

56   *దుందుభి*

57   *రుధిరోద్గారి*  రక్తధారలు ప్రవహిస్తాయి

58   *రక్తాక్షి*  ప్రజలకు కలుగుతాయి

59   *క్రోధన*  ప్రజలలో క్రోధం అధికమౌతుంది

60   *అక్షయ*   ప్రజలు సుభిక్షంగా ఉంటారు

నెగెటివ్ టు పాసిటివ్

 *నెగిటివ్ అంశాన్ని,పాజిటివ్ గా స్వీకరిస్తే!* 

🕉️🌞🌎🏵️🌼🚩


  *ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్ను పై  అతని ముందు రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి ఉంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని చదవసాగింది.. నిశ్శబ్దంగా!*


*నెగిటివ్ ఆలోచనలు!!!*


*"గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది...*

*"ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధి లో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.దానితో ఋణం తీరిపోయింది*                         


*"ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది.*


*"ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది.*


*"దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!"*


*చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది.*


*కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది.*


*ఆయనకి మెలుకువ వచ్చింది.  తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద రాసి ఉన్నది చదివాడు.*


*పాజిటివ్ గా ఆలోచిస్తే!!!*


*"గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పికి ఎట్టకేలకు ముగింపు పలక గలిగాను.*

*"ఈ ఏడాది లోనే నాకు అరవై ఏళ్లు నిండాయి.  సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడుపుతాను.*


*"ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే  ప్రశాంతంగా సహజమరణం చెందారు.*


*"ఈ ఏడాదిలోనే  నా కొడుకుకు కొత్త జీవితం వచ్చది. కారు పోతే పోయింది గానీ నా కొడుకు ఎలాంటి సమస్యా లేకుండా పెద్ద గండం నుండి బయట పడ్డాడు.*


*"హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"*


*అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు....*


*ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.*


*మంచి,చెడు అనేవి మన ఆలోచనా సరళే.మన ఆలోచనా సరళి సరిగా ఉంటే మనం చేసే పని సరైన దారిలో నడుస్తుంది. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఫలితం అనుకూలంగా ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. అదే కదా ఆనందమయమైన జీవితం. మన చేతుల్లో , ఆలోచనలని బట్టి దేముని ఆశీస్సులతో ఆశావహ దృక్పదాన్ని అలవరచుకొని ముందుకు  సాగుదాo. ఈ విపత్కర సమయములో ఇదే ముఖ్యం .*


🕉️🌞🌎🏵️🌼🚩

హారతి ఎందుకంటే

 🌺 హారతి వల్ల లాభము ఏమిటి


గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. సుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన  పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.🌺

ఉగాది అంటే

 _*ఉగాదిని చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ?*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*''ఉగ'' అంటే నక్షత్ర నడక అని, ''ఆది'' అంటే మొదలు అని అర్ధం. సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ''ఉగాది'' అన్నారు. మరోరకంగా చూస్తే ''యుగం'' అంటే రెండు అనే అర్ధం ఉంది. అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి ''యుగము'' అన్నారు. ''యుగం'' ప్రారంభమైన రోజు కనుక ''యుగాది'' అన్నారు. అదే క్రమంగా ''ఉగాది''* అయింది. చైత్ర శుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ.

అసలు చైత్ర మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు *"చిత్రా''* నక్షత్రంలో (దీన్నే చిత్తా నక్షత్రం అంటాం) ఉండటంవల్ల ఈ నెలకు *"చైత్రమాసం''* అనే పేరు వచ్చింది.


*ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ?*

ఇతర నెలల్లో కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కూడి ఉంటాడు కదా.. మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడంలేదు ? విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో  మరి భాద్రపదమాసం కంటే ఉత్క్రుష్టమైన నెల ఎదుంటుంది ? ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవడంలేదు ? ముఖ్యంగా అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. *''మాసానాం మార్గశీర్షోహం''* అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అవును , లోకకళ్యాణార్ధం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే. మరి అంత ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు ? ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో , భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి , కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. మనకు చాలా అవసరమైన చదువు , తెలివి డబ్బు , ధైర్యం అన్నిటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే. విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రకు సన్నాహాలు జరుగుతాయి. పోనీ శ్రీరామనవమి , శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా ! ఆ నెలల్లో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము ? చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో , ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసంలోనో ఉగాది ఎందుకు జరుపుకోము ? ఇలా చూస్తే పన్నెండు నెలల్లో ఏడాది పొడుగునా అనేక ప్రత్యేకతలు , పర్వదినాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ వదిలి చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా , సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం..

చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం , పగుళ్ళు , పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత , పిందెలు , పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా , ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో , వర్షాకాలంలో ఉండే మందగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.


*ఉగాదిరోజున ఏం చేయాలి ?*


*నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభః ప్రతి* *గృహ ధ్వజారోహణం   నింబ పత్రాశనం* *సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభః*

సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలౌతుంది. ధ్వజారోహణం చేయాలి. కొన్ని వేపాకులు నమలాలి. వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలి. కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకుని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమౌతాయి.


*ఉగాది పచ్చడి తినడంవల్ల ప్రయోజనం ఏమిటి?*


*శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్ధం సుఖానిచ*

*సర్వారిష్ట వినాశనం చ నింబ కందళ భక్షణం*

వేపపూత , బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. సర్వసంపదలు వస్తాయి. ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి.

శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుకనే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడివల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి , ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత , బెల్లం తోడ్పడతాయి.

అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహా విష్ణువును స్మరించుకుని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది.

చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాద్యమినాడే. కనుకనే ఉగాదినాడు విక్రమార్కుని స్మరించుకుని ఉత్సాహం పొందుతారు.

Friday, 9 April 2021

గురువా... గురువా..

 ~~~~~~~~~~~~

Maguva maguva song  

       converted into

     ....guruva guruva...

~~~~~~~~~~~~~~~

*పల్లవి*

గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా...!

గురువా గురువా 

నీ జ్ఞానానికి సరిహద్దులు కలవా...!


అటు ఇటు అన్నింటా, 

నువ్వే జగమంతా

బరువులు  మోస్తావు 

ఇంటా బయట...

అలసట  ఉందంటూ 

అననే అనవంట...

భవిష్యత్ రాస్తావు 

పిల్లల బ్రతుకంతా! 


స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...


గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా...!

గురువా గురువా 

నీ జ్ఞానానికి సరిహద్దులు కలవా...!


*చరణం*

నీ బోధన స్వరమే  శృతి చేయకపోతే 

ఈ భూమికి తెలవారదుగా...!

నీ కరముల కలమే కదలాడకపోతే 

ఏ అభ్యసన కొనసాగదుగా...!


ప్రతి మలుపులోను ప్రేమగా అల్లుకున్న బంధమా! అంతులేని నీ శ్రమ అంచనాలకందునా...!

ఆలయాలు కోరని జ్ఞానశక్తి రూపమా! 

నీవులేని జగతిలో శాస్త్రమే దొరుకునా...!


నీదగు సాధనలో 

ప్రియమగు బోధనలో 

ప్రతి ఒక విద్యార్థి నీవాడేగా...!


ఎందరి పెదవులలో 

ఏ చిరునవ్వున్నా 

ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా...!



స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స...


గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా...!

గురువా గురువా 

నీ జ్ఞానానికి సరిహద్దులు కలవా...!

*~~~~~~~///~~~~~~*

*Dedicated to all the TEACHERS at all levels, all over the world.*🙏

Wednesday, 7 April 2021

Saturday, 3 April 2021

50 రూపాయల నోటు పారేసుకున్నాను

  50 రూపాయల నోటు పారేసుకున్నాను


ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ 

.

దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది . 

.

"దయచేసి చదవండి " అని రాసి ఉంది. 

ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను . 

.

.

" ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు. మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెఛ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి " అని రాసి ఉంది.

.

.

నాకు ఎందుకో ఆ అడ్రస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది.

.

అడ్రస్  గుర్తుపెట్టుకున్నాను .

.

అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక. 

దగ్గరకు వెళ్లి పిలిస్తే పాక లో నుండి ఒక వృధ్ధురాలు వచ్చింది. 

ఆమె కు కళ్ళు సరిగా కనబడటం లేదు.

ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది. 

చేతి కర్ర సహాయంతో తడుము కుంటూ బయటకు వచ్చింది. 

.

.

"ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది. అది ఇఛ్చి పోదామని వచ్చాను " అన్నాను. 

.

.

.

ఆమె ఏడుస్తోంది. 

.

"బాబూ ! ఇప్పటికి ఇలా దాదాపు 50-60 మంది వఛ్చి ఒక్కొక్కరూ 

ఒక 50 రూపాయలు ఇస్తున్నారు . నాకు కళ్ళు కనబడవు. 

నాకు చదవడం రాయడం రాదు. నేను అది రాయలేదు బాబూ ! ఎవరో నాకు సహాయం చెయ్యాలి అనిపించి అలా రాశారేమో !" 

.

.

" పోన్లే అమ్మా ఇదిగో ఈ యాభై నోటు తీసుకో ! " 

.

.

బాబూ ! అది నేను రాయలేదు. నా ఇబ్బంది చూసి ఎవరో మహానుభావుడు ఇలా రాసిపెట్టి ఉంటాడు. 

వెళ్ళేటపుడు అది కాస్త చించెయ్యి బాబూ ! అంది.

.

.

ఆమె ఇలాగే అందరికీ చెప్పి ఉంటుంది . 

ఒక్కరూ చించెయ్యలేదు. ఆమె రాయలేదు. 

ఎవరో ఆమెకు సహాయపడటం కోసం ఇలా రాశారు . 

.

.

ఆ రోడ్డున వెడుతున్న ఎందరిలోనో కొందరు అది చూస్తారు. 

అలా చూసిన ఎందరిలోనో కొందరు ఆమెకు సహాయ పడాలని అనుకుంటారు. అలా అనుకున్న ఎందరిలోనో కొందరు ఆమె ఇంటికి వఛ్చి ఆమెకు సహాయ పడతారు. నేను అది చించేస్తే ఆమెకు అలాంటి సహాయం దూరం చేసిన వాడిని అవుతాను. 

ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు. 

.

అది చింపెయ్యనా ? 

ఉంచెయ్యనా ? 

.

నాకు చెప్పినట్టే ఇంతకు ముందు వాళ్లకు కూడా చెప్పి ఉంటుంది కదా ! వాళ్ళెవరూ చింపెయ్యలేదు. 

అంటే అందరూ ఆమెకు ఈ రకంగా సహాయం అందాలి అని కోరుకుంటున్నారు. 

మరి నేను ఎందుకు అది చింపెయ్యడం. 

ఇలా అనుకుంటూ వస్తున్నాను.

.

.

ఒకాయన చేతిలో చిన్న కాగితం పట్టుకుని ఎదురుపడ్డాడు. 

.

.

.

సర్ ! ఈ అడ్రస్ చెప్పగలరా ? నాకు ఒక 50 నోటు దొరికింది. 

వాళ్లకి ఇచ్ఛేద్దామని అడ్రస్ అడుగుతున్నాను.

.

.

.

ఆమె అడ్రస్  

.

.

.

నాకు అనిపించింది "మానవత్వం చచ్చిపోలేదు" .

.

అది రాసిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను . ఎవరికయినా సహాయం చెయ్యాలి అంటే ఎన్నో మార్గాలు. 

ఈ మార్గం ఎంచుకున్న వ్యక్తిని మనసులోనే అభినందించాను. ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు ఇది ఒక ఊరట కలిగిస్తుంది అనడం లో నాకు సందేహం లేదు. 

.

.

అది చింపడం భావ్యం కాదు .అనిపించింది .

.

.

.

నేను అది చింపేయాలా ? 

అలా వదిలేయాలా ? 

.

.

వదిలేశాను. 

.

.

.

.

.

వదిలేసి నేను మంచి పని చేశానా ? లేదా ? 

.

.

మీరే చెప్పండి. . . . . 

ఇది కధ అయి ఉండొచ్చు. . . . 

కానీ ఈ పరిస్థితి ఎదురయితే. . . . .

.

.

పనికి రాని మెస్సేజ్ లు చాలా పోస్ట్ చేస్తాం. 

ఇలాంటివి కనువిప్పు కలిగించే పోస్ట్ లు మాత్రం వదిలెయ్యకండి. 

.ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇతరుల కోసం సహాయం చేసి ఉంటారు, అలాగే చేస్తూ ఉండండి.

మీలో ఉన్న మనవత్వానికి నా హ్రుదయ పూర్వక నమస్కారం. 

🌷🙏🙏🙏🙏🌷

పసుపులేటి నరేంద్రస్వామి 

.