Sunday, 11 April 2021

కరోనా హెచ్చరిక


కరోనా హెచ్చరిక

 ప్రమాదం *మరోసారి* కాపు కాసుకుని ఉంది.

*ఈ నాలుగు మాటలు చదవండి... ఆచరించండి... జాగ్రత్తగా ఉండండి...*

మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం.  మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.


ఒక సర్వే ప్రకారం...

మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం.  టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు *లక్షల్లో మనమధ్యే ఉన్నారు.*


*అందుచేత...*

● దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి.

● తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి.

● చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి.

● ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి.

● ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి.

● చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి.

● ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి.

● అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి.

● వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.

● వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి.  అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు.

● మీరు వారికి ఎంత ప్రాణస్నేహితులైనా కావచ్చు... లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు... వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి.

● ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి.

● అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి.

● ఇచ్చి పుచ్చుకోవడాలు మరికొంతకాలం ఆపేయండి.

● ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి.

● స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి. 

● ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

● అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి.

● గ్రూప్ వాకింగ్ కూడా మానేయండి.

● ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి.

● నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికీ క్షేమదాయకం.


ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి.

No comments:

Post a Comment