*🍃🌷దయా గుణం కలిగి ఉండాలి🌹*
🕉️🌞🌎🏵️🌼🚩
*శరీరం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు,*
*మనిషి చేసే ఉపకారాలు* *దానాలే అతడి*
*కీర్తిని చిరస్థాయిగా* *ఉంచుతాయి,*
*దానగుణంలొ తనకెవరు* *సాటిలేరని* *నిరూపించుకున్నాడు* *కర్ణుడు ..!*
*మహాదాతగా పేరు తెచ్చుకొని*
*చిరస్థాయిగా నిలిచాడు*
*ఒకరోజు అతడు ఓ బంగారు గిన్నెలో*
*సుగంధ భరితమైన లేపనాన్ని ఎడమ చేత*
*పట్టుకొని, కుడిచేతితో ఒంటికి పూసుకొంటున్నాడు,*
*అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీ కృష్ణుడు*
*బంగారు గిన్నె ఎంత చూడ ముచ్చటగా --*
*ఉందో అన్నాడు, కర్ణుడు నవ్వుతూ ఇదిగో*
*కృష్ణా .... తీసికో ... అని -- ఇవ్వబోయాడు,*
*అదేమిటి కర్ణా -- ఎడమచేతి తో ఇస్తు ఉన్నావు,*
*అనే సరికి ..... ఈ గిన్నె కుడి చేతికి మారేసరికి*
*నా బుద్ధి మారిపోవచ్చు అని చెప్పినాడు కర్ణుడు,*
*ఎవరు ఏది కావాలంటే వెంటనే దానం*
*చేయడంలోనే అసలైన ఆనందం ఉందని*
*పురాణాలు చెబుతున్నాయి,*
*మనిషి జీవితం లో మూడు విషయాలు*
*ముఖ్యమైనవని, శాస్త్రాలు చెబుతున్నాయి*
*ఒకటి దయ కలిగి ఉండటం,*
*రెండు దయ కలిగి ఉండటం,*
*మూడోది కూడా దయ కలిగి* *ఉండటమే,*
*మనసులో దయాగుణం ఉన్నవారే*
*దానధర్మాలు విరివిగా చేస్తూంటారు*
🕉️🌞🌎🏵️🌼🚩
No comments:
Post a Comment