Saturday, 10 April 2021

త్రివిధ త్యాగాలు

 🙏   త్రివిధ త్యాగాలు  🙏


🍂🍂🍂☘️☘️☘️🍂🍂🍂


ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి.


ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జనన మరణ సంసారచక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.


యత్కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి దదాసియత్

యత్తపస్యసి, కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్


" అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, అదంతా నాకు సమర్పించు.


అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి?

ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.


🍂 మొదటిది కర్తృత్వ త్యాగం:

                  ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కర్యాలకు పూనుకుంటాము.


🍂 రెండవది ఫలత్యాగం:

               ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.


🍂 మూడోది సంగత్యాగం:

              ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే

నాఆనందం అని మనస్పూర్తిగా అనుకోవాలి.


సరే! ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి?


ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెపితే చాలు.

ఏమిటండీ ఆ బంగారాల మాట? అదే 


🙏🏻 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🏻


పై త్రివిధ త్యాగలను త్రికరణ శుద్ధిగా అవలంబిస్తూ, ఇంకొక్క మాటను కూడా జోడించాలి.అది...


🙏🏻 సర్వేజనా సుఖినోభావంతు 🙏🏻


🍁🍁🍁🍁

No comments:

Post a Comment